Gemini యాప్స్ గోప్యతా హబ్

చివరిగా అప్‌డేట్ చేసింది: 2025 మే 23

విషయ పట్టిక

Gemini యాప్స్ గోప్యతా ప్రకటన

చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 20 మే, 2025

Gemini Apps విషయంలో మీ డేటా

మీరు Geminiతో ఇంటరాక్ట్ అయినప్పుడు Google, మీ డేటాను ఎలా హ్యాండిల్ చేస్తుంది అన్న అంశాన్ని ఈ నోటీస్, అలాగే మా గోప్యతా పాలసీ వివరిస్తాయి. ఈ నోటీస్, పాలసీ రెండూ ఇక్కడ లిస్ట్ చేసిన యాప్‌లు, సర్వీస్‌లు (“Gemini యాప్స్” లేదా “Gemini”) ద్వారా ఈ వివరాలను వెల్లడిస్తాయి. Gemini మీ వ్యక్తిగత AI అసిస్టెంట్, దీన్ని Google అందిస్తోంది.

ఐరోపా ఆర్థిక మండలిలో, స్విట్జర్లాండ్‌లో, Gemini యాప్స్‌ను Google Ireland Limited అందిస్తోంది. ఇతర దేశాల్లో/ప్రాంతాల్లో Gemini యాప్స్‌ను Google LLC అందిస్తోంది. మేము Google Ireland Limitedను, Google LLCని దిగువున Google అని సూచిస్తాము.

ఏ డేటా సేక‌రించ‌బ‌డుతుంది, అది ఎలా ఉప‌యోగించ‌బ‌డుతుంది

Gemini యాప్స్‌తో మీరు షేర్ చేసే చాట్స్‌ను (మీ Gemini Live ఇంటరాక్షన్‌ల రికార్డింగ్‌లతో సహా), అలాగే మీరు షేర్ చేసే కంటెంట్‌ను (మీ బ్రౌజర్ నుండి ఫైళ్లు, ఇమేజ్‌లు, స్క్రీన్స్,పేజీ కంటెంట్ వంటి వాటిని), మీ Google ఖాతాలోని ప్రోడక్ట్ యూసేజ్ సమాచారాన్ని, మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను, కనెక్ట్ చేయబడిన యాప్‌ల నుండి సమాచారాన్ని, లొకేషన్ సమాచారాన్ని Google కలెక్ట్ చేస్తుంది. మీ లొకేషన్ సమాచారంలో మీ డివైజ్ ఉన్న జనరల్ ఏరియా, IP అడ్రస్ లేదా మీ Google ఖాతాలో సేవ్ చేసిన ఇంటి అడ్రస్‌లు లేదా వర్క్ అడ్రస్‌ల వంటి వివరాలు ఉంటాయి. g.co/privacypolicy/locationలో లొకేషన్ డేటా గురించి మరింత తెలుసుకోండి.

Google Cloud వంటి Google ఎంటర్‌ప్రయిజ్ ప్రోడక్ట్‌లతో సహా Google ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను అందించడానికి, వాటిని మెరుగుపరచడానికి, డెవలప్ చేయడానికి, వ్యక్తిగతీకరించడానికి Google ఈ డేటాను మా గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగిస్తుంది.

మీ వయసు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, Gemini యాప్స్ యాక్టివిటీ ఆటోమేటిక్‌గా ఆన్‌లో ఉంటుంది. 13 (లేదా మీ దేశంలో వర్తించే వయోపరిమితి) నుండి 18 మధ్య వయసు ఉన్న యూజర్‌లు దీన్ని ఆన్ చేసుకోవచ్చు. మీ వయసు 13 సంవత్సరాల కంటే (లేదా మీ దేశంలో వర్తించే వయోపరిమితి) తక్కువ ఉండి, మీకు Gemini యాప్స్ అందుబాటులో ఉంటే, Gemini యాప్స్ యాక్టివిటీ ఆఫ్‌లో ఉంటుంది. మీ Gemini యాప్స్ యాక్టివిటీ సెట్టింగ్ ఆన్‌లో ఉంటే, Google మీ Gemini యాప్స్ యాక్టివిటీని మీ Google ఖాతాలో 18 నెలల వరకు స్టోర్ చేస్తుంది. దీన్ని మీ Gemini యాప్స్ యాక్టివిటీ సెట్టింగ్లో 3 నెలలకు లేదా 36 నెలలకు మార్చుకోవచ్చు.

Googleకు చెందిన AI టెక్నాలజీలను రివ్యూవ‌ర్‌లు ఎలా మెరుగుప‌రుస్తారు

క్వాలిటీ విషయంలో సహాయపడటంతో పాటు, మా ప్రోడక్ట్‌లను (Gemini యాప్స్‌ పని చేయడానికి తోడ్పడే జెనరేటివ్ మెషిన్-లెర్నింగ్ మోడల్స్ వంటి వాటిని) మెరుగుపరచడానికి, Gemini యాప్స్‌తో మీరు జరిపిన సంభాషణలను రివ్యూవర్‌లు (సర్వీస్ ప్రొవైడర్లతో సహా) చదవుతారు, అదనపు గమనికలు జోడిస్తారు, అలాగే వాటిని ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో భాగంగా మీ గోప్యతను కాపాడటానికి మేము తగిన చర్యలు తీసుకుంటాము. దీనిలో భాగంగా, Gemini యాప్స్‌తో మీరు జరిపిన సంభాషణలను రివ్యూవర్‌లు చూడటానికి ముందు లేదా వారు అదనపు గమనికలను జోడించడానికి ముందు, వాటిని మీ Google ఖాతా నుండి డిస్‌కనెక్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీ సంభాషణలలో గోప్యమైన సమాచారాన్ని ఎంటర్ చేయకండి లేదా రివ్యూవర్ చూడకూడదని మీరు అనుకుంటున్న లేదా మా ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి Google ఉపయోగించకూడదు అని మీరు భావించే ఎటువంటి డేటానూ ఎంటర్ చేయవద్దు.

మీ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయడం

మీ డేటాను సురక్షితంగా ఉంచడానికి, అలాగే మీ గోప్యతను సంరక్షించడానికి వీలు కల్పించే సెట్టింగ్‌లను, టూల్స్‌ను యాక్సెస్ చేయడానికి మీ Google ఖాతాకు వెళ్లండి.

భవిష్యత్తులో సంభాషణలను రివ్యూ చేయకుండా లేదా Google మెషిన్-లెర్నింగ్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి ఉపయోగించకుండా ఆపడానికి, Gemini యాప్స్ యాక్టివిటీని ఆఫ్ చేయండి. మీరు Gemini యాప్స్ యాక్టివిటీలో కూడా గత సంభాషణలను రివ్యూ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు. 

రివ్యూవర్లు రివ్యూ చేసిన లేదా అదనపు గమనికలు జోడించిన సంభాషణలు (అలాగే మీ భాష, డివైజ్ రకం, లొకేషన్ సమాచారం లేదా ఫీడ్‌బ్యాక్ లాంటి సంబంధిత డేటా) మీరు మీ Gemini యాప్స్ యాక్టివిటీని తొలగించినప్పుడు తొలగించబడవు. బదులుగా, అవి మూడు సంవత్సరాల వరకు స్టోర్ అయ్యి ఉంటాయి.

Gemini యాప్స్ యాక్టివిటీ ఆఫ్‌లో ఉన్నా కూడా, మీ సంభాషణలు గరిష్ఠంగా 72 గంటల పాటు మీ ఖాతాలో సేవ్ అవుతాయి. ఇందువల్ల ఈ సర్వీస్‌ను అందించడానికి, అలాగే ఏదైనా ఫీడ్‌బ్యాక్‌ను ప్రాసెస్ చేయడానికి Googleకు వీలవుతుంది. ఈ యాక్టివిటీ మీ Gemini యాప్స్ యాక్టివిటీలో కనిపించదు. మరింత తెలుసుకోండి.

Gemini యాప్స్ యాక్టివిటీ ఇత‌ర స‌ర్వీస్‌లు, సెట్టింగ్‌ల‌లో ఎలా వ‌ర్క్ చేస్తుంది

మీరు ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేసినా లేదా మీ Gemini యాప్స్ యాక్టివిటీని తొలగించినా, ఇతర Google సెట్టింగ్‌లు మారవు. మీరు ఇతర Google సర్వీస్‌లను వినియోగిస్తున్న‌ప్పుడు, వెబ్ & యాప్ యాక్టివిటీ లేదా లొకేషన్ హిస్టరీ, వంటి ఇతర సెట్టింగ్‌లు లొకేషన్‌ను, ఇతర డేటాను సేవ్ చేయడం కొనసాగించే అవకాశం ఉంది. మీరు Gemini యాప్స్‌ను ఇతర Google సర్వీస్‌లతో కూడా ఇంటిగ్రేట్ చేయవచ్చు, ఉపయోగించవచ్చు. మీరు అలా చేసినప్పుడు, ఆ సర్వీసులు మీ డేటాను వాటి పాలసీలకు, Google గోప్యతా పాలసీకి అనుగుణంగా సేవ్ చేసుకుంటాయి. ఆ డేటాను వాటి సర్వీసులను అందించడానికి, మెరుగుపరచడానికి ఉపయోగించుకుంటాయి. ఒకవేళ మీరు Gemini యాప్స్‌ను ఉపయోగించి థర్డ్-పార్టీ సర్వీసులతో ఇంటరాక్ట్ అయినట్లయితే, సదరు సర్వీసులు వాటి సొంత గోప్యతా పాలసీలకు అనుగుణంగా మీ డేటాను ప్రాసెస్ చేస్తాయి.

మీ కోసం వ్యక్తిగతీకరించిన AI అసిస్టెంట్‌గా Gemini

మీ ప్రాంతం, సెట్టింగ్‌లను బట్టి Gemini యాప్స్ మీ ఎక్స్‌పీరియెన్స్‌ను వ్యక్తిగతీకరించగలవు. మరింత తెలుసుకోండి.

కంటెంట్ తీసివేతను రిక్వెస్ట్ చేయ‌డం, మీ డేటాను ఎగుమతి చేయ‌డం

ఏదైనా కంటెంట్ మా పాలసీలకు లేదా వర్తించే చట్టాలకు అనుగుణంగా లేదని మీరు భావిస్తే, దాన్ని తీసివేయాల్సిందిగా మీరు రిక్వెస్ట్ను సమర్పించవచ్చు. అంతే కాక, మీ సమాచారాన్ని మీరు ఎగుమతి చేసుకోవచ్చు.

Androidలో Geminiని మీ డివైజ్ అసిస్టెంట్‌గా ఉపయోగించడం

  • అదనపు డేటా హ్యాండ్లింగ్. Gemini, మీ డివైజ్ అసిస్టెంట్‌గా, మీరు చెబుతున్నది అర్థం చేసుకోవడానికి, సమాధానం ఇవ్వడానికి, పనులు పూర్తి చేయడంలో మీకు సాయం చేయడానికి, మీ డివైజ్‌ల్లో, సర్వీసుల్లో ఉన్న సమాచారాన్ని కూడా ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మా గోప్యతా విధానానికిఅనుగుణంగా ఉంటుంది. ఉదాహరణకు Gemini, Google Assistant ద్వారా అందే డేటాతో సహా కొన్ని నిర్దిష్టమైన సిస్టమ్ అనుమతులను, డేటాను యాక్సెస్ చేస్తుంది. ఇందులో డయలర్, కాల్ లాగ్స్, మెసేజ్ లాగ్స్, కాంటాక్ట్‌లు (కనెక్ట్ అయి ఉండటంలో మీకు సహాయపడటానికి) ఉంటాయి. గడియారం వంటి ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్‌లు, Geminiతో మాట్లాడటంలో మీకు సహాయపడటానికి భాషా ప్రాధాన్యతలు, కంటెంట్‌పై ఏదైనా చర్య తీసుకోవడంలో మీకు సహాయపడటానికి స్క్రీన్ మీద ఉండే కంటెంట్‌ కూడా యాక్సెస్ పొందే డేటాలో ఉంటాయి. Gemini, Google Assistantల కోసం మీరు ఉపయోగించే డివైజ్‌ల నుండి, సర్వీసుల నుండి Gemini, సందర్భోచిత సమాచారాన్ని (స్మార్ట్ హోమ్ డివైజ్ పేర్లు, ప్లేలిస్ట్‌ల వంటి వాటిని) కూడా యాక్సెస్ చేస్తుంది. Gemini కోసం మీ యాప్ అనుమతులను (డివైజ్‌ లొకేషన్, మైక్రోఫోన్, కెమెరా వంటివి) ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించిమరింత తెలుసుకోండి.
  • Google Assistant నుండి సహాయం. నిర్దిష్టమైన పనులు చేసేందుకు Gemini, Google Assistant నుండి సహాయం తీసుకున్నప్పుడు, సంబంధిత Google Assistant సెట్టింగ్‌లు వర్తిస్తాయి. కనెక్ట్ చేసిన యాప్‌ల ద్వారా Gemini చర్యలను నేరుగా పూర్తి చేసినప్పుడు, ఆ Google Assistant సెట్టింగ్‌లు వర్తించవు. Gemini, Google Assistant ఎలా కలిసి పని చేస్తాయి అనే దాని గురించి మరింత తెలుసుకోండి . మీరు Google Assistant నుండి Geminiకి అప్‌గ్రేడ్ అయినప్పుడు కమ్యూనికేషన్‌ల క్వాలిటీని మెరుగుపరచడానికి, కొన్ని ప్రాంతాలలో మీ ఇటీవలి Google Assistant కమ్యూనికేషన్‌ల రిక్వెస్ట్ హిస్టరీ (ఉదాహరణకు, “ప్రసాద్‌కు మెసేజ్ పంపండి”), Gemini యాప్స్ యాక్టివిటీకి దిగుమతి (ఇంపోర్ట్) అయ్యే అవకాశం ఉంది. మరింత తెలుసుకోండి.  
  • Geminiతో మాట్లాడటం. మీ సెట్టింగ్‌ల‌లో “Ok Google” & వాయిస్ మ్యాచ్‌ (Google Assistant ఆధారితం) ఆన్‌లో ఉంటే, మీరు Geminiతో లేదా Google Assistantతో హ్యాండ్స్ ఫ్రీగా (రెండింటిలో ఏది యాక్టివ్‌గా ఉంటే దానితో) మాట్లాడ‌వ‌చ్చు. యాక్టివేట్ కావాలని మీరు అనుకోని సమయంలో Gemini యాక్టివేట్ కావచ్చు. ఉదాహరణకు “Ok Google” లాంటి శబ్దం వచ్చినప్పుడు లేదా మీరు పొరపాటున తాకడం వల్ల యాక్టివేట్ అయ్యి ఉండవచ్చు. Gemini సమాధానం ఇస్తే, అది మీ ఇన్‌పుట్‌ను సాధారణ యాక్టివేషన్ మాదిరిగానే పరిగణిస్తుంది. మీ Gemini యాప్స్ యాక్టివిటీ సెట్టింగ్ గనుక ఆన్‌లో ఉంటే, ఈ డేటా, ఈ నోటీస్‌కు, Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగించబడుతుంది. రివ్యూవర్‌ల సహాయంతో Googleకు చెందిన AI టెక్నాలజీలను మెరుగుపరచడానికి వినియోగించబడుతుంది.

అనుబంధ ఫీచర్‌లు

మీరు Gemini యాప్స్‌లో వివిధ సప్లిమెంటల్ ఫీచర్లను (Gems లేదా సేవ్ చేసిన సమాచారంవంటి వాటిని) ఉపయోగించుకోవచ్చు. ఈ సప్లిమెంటరీ (అనుబంధ) ఫీచర్లను ఉపయోగించినప్పుడు, మీరు ఇచ్చే అదనపు డేటాను (Gem పేర్లు, అనుకూల సూచనల వంటి వాటిని) కూడా సేకరిస్తాము. దీన్ని ఈ నోటీసుకు, మా గోప్యతా పాలసీకి అనుగుణంగా, రివ్యూవర్‌ల సహాయంతో Googleకు చెందిన AI టెక్నాలజీలను మెరుగుపరచడానికి వినియోగిస్తాము.  

తెలుసుకోవాల్సిన విషయాలు

  • Gemini యాప్స్ నిరంతరంగా ఎవాల్వ్ అవుతూ (అభివృద్ధి చెందుతూ) వస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి, Google అభిప్రాయాలకు విరుద్ధంగా ఉండే తప్పు సమాచారాన్ని, అభ్యంతరకరమైన, లేదా అనుచితమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉందని గమనించండి.
  • Gemini ఇచ్చే సమాధానాలను వైద్యపరమైన, చట్టపరమైన, ఆర్థికపరమైన, లేదా ఇతర వృత్తిపరమైన సలహాలుగా భావించకూడదు.
  • మీ వద్ద అవసరమైన హక్కులు ఉన్న కంటెంట్‌ను మాత్రమే అప్‌లోడ్ చేయండి, జెనరేట్ చేయండి, ఎడిట్ చేయండి.
  • మీ ఫీడ్‌బ్యాక్ Geminiని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మరింత తెలుసుకోవడానికి Gemini యాప్స్ గోప్యతా హబ్ను చూడండి.

సర్వీస్ నియమాలు

గమనిక: Google నియమాలు ఇంకా జెనరేటివ్ AI నిషేధిత వినియోగ పాలసీ Gemini యాప్స్‌కు వర్తిస్తాయి.

మీరు కొరియాకు చెందిన కన్జ్యూమర్ అయితే, మీరు Gemini యాప్స్‌ను వినియోగించడం అనేది కొరియన్ లొకేషన్ సర్వీస్ నియమాలకు కూడా లోబడి ఉంటుందని అంగీకరిస్తున్నారు. 

గోప్యతా ప్రశ్నలు

చివరిగా అప్‌డేట్ చేసింది: 2025 మే 23

సాధారణం

Gemini యాప్స్ అంటే ఏమిటి?

Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో, అలాగే Gemini యాప్స్ గోప్యతా హబ్‌లో రెఫర్ చేసిన Gemini యాప్స్‌లో ఇవి చేర్చబడి ఉంటాయి:

"Gemini యాప్స్"ను కొన్నిసార్లు "Gemini యాప్" లేదా "Gemini" అని కూడా రెఫర్ చేస్తూ ఉంటారు. మీకు వర్క్ ప్లేస్ లేదా స్కూల్ Google ఖాతా ఉంటే, మీరు Gemini యాప్స్‌ను వేర్వేరు డేటా హ్యాండ్లింగ్ నియమాలకు లోబడి ఉపయోగించాల్సి రావచ్చు. Google Workspace గోప్యతా హబ్‌లోని జెనరేటివ్ AIలో మరింత తెలుసుకోండి.

నా డేటాను ప్రాసెస్ చేయడానికి అడ్డు చెప్పడం ఎలా? లేదా Gemini యాప్స్ సమాధానాల్లో తప్పుగా ఉన్న డేటాను సరిదిద్దాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం ఎలా?

LLM టెక్నాలజీలు (Gemini యాప్స్‌తో సహా) ట్రెయినింగ్‌పై ఆధారితం కాని సమాధానం ఇవ్వవచ్చు, ఇంకా తప్పు సమాచారాన్ని వాస్తవమైన సమాచారంగా అందించవచ్చు.

EUలో జనరల్ డేటా రక్షణ నియంత్రణ చట్టంతో సహా, నిర్దిష్ట గోప్యతా చట్టాల ప్రకారం, మీకు వీటిని చేసే హక్కు ఉండవచ్చు:

  1. మీ వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడానికి అడ్డు చెప్పవచ్చు లేదా
  2. Gemini యాప్స్ సమాధానాల్లో తప్పుగా ఉన్న వ్యక్తిగత డేటాను సరిదిద్దమని అడగవచ్చు.

ఈ హక్కులను వినియోగించుకోవడానికి, మీరు మా సహాయ కేంద్రంలో రిక్వెస్ట్‌ను క్రియేట్ చేయవచ్చు.

మీరు నేరుగా Gemini యాప్స్‌లో కూడా రిక్వెస్ట్‌ను క్రియేట్ చేయవచ్చు. Gemini యాప్స్ సమాధానం కింద, మరిన్ని ఆ తర్వాత చట్టపరమైన సమస్య గురించి రిపోర్ట్ చేయండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

రిక్వెస్ట్‌ను క్రియేట్ చేయండి

అదనపు రిసోర్స్‌లు

మేము సేకరించిన డేటాకు సంబంధించి, మీ హక్కులను ఎలా వినియోగించుకోవాలనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, Google గోప్యతా పాలసీని, Gemini యాప్స్ గోప్యతా ప్రకటనను చదవండి.

యూరోపియన్ యూనియన్ (EU) లేదా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) డేటా సంరక్షణ చట్టం కింద, Gemini యాప్స్ డేటాను ప్రాసెస్ చేయడంలో Googleకు ఉన్న చట్టపరమైన ప్రాతిపదికలు ఏమిటి?

మీ సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానానికి యూరోపియన్ యూనియన్ (EU) లేదా యునైటెడ్ కింగ్‌డమ్ (UK) డేటా సంరక్షణ చట్టం వర్తిస్తే, దయచేసి దిగువున ఉన్న వివరాలను జాగ్రత్తగా చదవండి.

మీరు Gemini యాప్స్‌ను ఉపయోగించినప్పుడు, దిగువున వివరించిన అవసరాల కోసం, చట్టపరమైన ప్రాతిపదికలకు అనుగుణంగా, Google మీ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది.

“మీ Gemini యాప్స్ సమాచారం” అని మేము రెఫర్ చేసినప్పుడు దాని పరిధిలోకి ఇవన్నీ వస్తాయి: (i) మీ Gemini యాప్స్ సంభాషణలు, (మీరు వర్తింపజేసిన ఏవైనా అనుకూల సూచనలతో సహా), సంబంధిత ప్రోడక్ట్ వినియోగ సమాచారం (దీనిలో మీ లొకేషన్ సమాచారం కూడా ఉంటుంది), అంతే కాకుండా Gemini మీ మొబైల్ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు ప్రాసెస్ చేసిన ఏదైనా అనుబంధ సమాచారం; (ii) మీ ఫీడ్‌బ్యాక్.

Google చట్టపరమైన ప్రాతిపదికలు:

  • ఒప్పందాన్ని పాటించడం. మేము మీ Gemini యాప్స్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము, దానితో పాటు మీరు Gemini యాప్స్‌ను ఏదైనా ఇతర సర్వీస్‌తో ఇంటిగ్రేట్ చేసి, దానిని ప్రాసెస్ చేయడానికి Gemini యాప్స్‌ను అనుమతించినప్పుడు, అటువంటి ఇతర సమాచారాన్ని కూడా మేము ప్రాసెస్ చేస్తాము. తద్వారా మీరు రిక్వెస్ట్ చేసిన Gemini యాప్స్ సర్వీస్‌ను Google సర్వీస్ నియమాల, ప్రకారం అందించడానికి, మెయింటెయిన్ చేయడానికి వీలవుతుంది. ఉదాహరణకు, మీ క్వెరీలకు సమాధానం ఇవ్వడానికి, కోడ్ జెనరేషన్ వంటి వివిధ Gemini యాప్స్ ఫీచర్‌లను, ఫంక్షనాలిటీలను అందించడానికి మేము మీ Gemini యాప్స్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము.
  • Googleకు చెందిన, అలాగే థర్డ్-పార్టీలకు చెందిన చట్టబద్ధమైన ప్రయోజనాలకు అనుగుణంగా తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ మీ గోప్యత పరిరక్షించబడుతుంది.
    • మేము పబ్లిక్‌గా యాక్సెస్ చేయగల సోర్స్‌ల నుండి అందే సమాచారంతో పాటు Gemini యాప్స్‌లోని మీ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము. తద్వారా Google ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను అందించగలము, మెయింటైన్ చేయగలము, మెరుగుపరచగలము, డెవలప్ చేయగలము.
      • ఈ కింది అవసరాల కోసం ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం అన్నది, Googleతో పాటు మా యూజర్ల యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలను నెరవేర్చడం దృష్ట్యా తప్పనిసరి:
        • మా యూజర్‌ల అవసరాలను (ఉదాహరణకు: Gemini యాప్స్ సమాధానాల్లో భద్రతను, ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి, మోడళ్లను ఫైన్-ట్యూన్ చేయడానికి సంభాషణలను ఉపయోగించడం వంటివి) తీర్చే విధంగా మా సర్వీస్‌లను అందించడం, మెయింటైన్ చేయడం, మెరుగుపరచడం.
        • మా యూజర్‌లకు ఉపయోగకరమైన కొత్త ప్రోడక్ట్‌లను, ఫీచర్‌లను డెవలప్ చేయడం (ఒక నిర్దిష్ట ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఉత్తమంగా సరిపోయే కొత్త లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌కు రిక్వెస్ట్‌లను ఎలా పంపించాలో నేర్చుకోవడం, లేదా ఈ రిక్వెస్ట్‌లను హ్యాండిల్ చేయడానికి కొత్త మోడల్స్‌కు ట్రెయినింగ్ ఇవ్వడం వంటివి).
        • మా సర్వీస్‌ల పనితీరును నిర్ధారించడానికి, మెరుగుపరచడానికి మా సర్వీస్‌లను యూజర్‌లు ఎలా ఉపయోగిస్తున్నారో అర్థం చేసుకోవడం (యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచే ఉద్దేశంతో, యూజర్‌లు, Gemini యాప్స్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు అన్నది అర్థం చేసుకోవడానికి కొలమానాలను జెనరేట్ చేయడం వంటివి).
        • యూజర్‌లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ను అందించడం కోసం మా సర్వీస్‌లను అనుకూలంగా మార్చడం (ఉదాహరణకు, మీ లొకేషన్ సమాచారాన్ని, మీ గత సంభాషణలను ఉపయోగించడం ద్వారా Gemini యాప్స్ మరింత సందర్భోచితమైన సమాధానాన్ని అందించగలవు).
    • Gemini యాప్స్ ఫంక్షనాలిటీని, భద్రతను, విశ్వసనీయతను మెయింటెయిన్ చేయడానికి కూడా మేము మీ Gemini యాప్స్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాం. ఇందులో- Googleకు, మా యూజర్‌లకు, లేదా పబ్లిక్‌కు హాని కలిగించగల మోసాన్ని, దుర్వినియోగాన్ని, సెక్యూరిటీ రిస్క్‌లను, సాంకేతిక సమస్యలను గుర్తించడం, నివారించడం, రెస్పాండ్ కావడం వంటివి కూడా ఉంటాయి.
      • ఈ కింది అవసరాల కోసం ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయడం అన్నది, Googleతో పాటు మా యూజర్ల యొక్క చట్టబద్ధమైన ప్రయోజనాలను నెరవేర్చడం దృష్ట్యా తప్పనిసరి:
        • మా సర్వీస్‌లకు సంబంధించి మోసాన్ని, దుర్వినియోగాన్ని, సెక్యూరిటీ రిస్క్‌లను, లేదా టెక్నికల్ సమస్యలను గుర్తించడం, నివారించడం, లేదా పరిష్కరించడం (బగ్‌లను, వైఫల్యాలను పరిష్కరించడం వంటివి).
        • చట్టపరమైన ఆవశ్యకతలకు అనుగుణంగా లేదా చట్టం అనుమతించిన మేరకు Googleకు, మా యూజర్‌లకు, లేదా పబ్లిక్‌కు సంబంధించిన హక్కులకు, ఆస్తికి, లేదా భద్రతకు హాని కలిగించే వాటి నుంచి రక్షించడం (ఉదాహరణకు, సేఫ్టీ క్లాసిఫయర్‌లను, మోడల్ ఫిల్టర్‌లను అప్‌డేట్ చేయడం వంటివి).
        • మా యూజర్‌లకు, పబ్లిక్‌కు ప్రయోజనకరంగా ఉండే విధంగా మా సర్వీస్‌లను మెరుగుపరచడం కోసం రీసెర్చ్‌ను నిర్వహించడం.
        • చట్టపరమైన దావాలను అమలు చేయడం. ఇందులో వర్తించే సర్వీస్ నియమాలను ఏమైనా ఉల్లంఘించారా అన్న విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం కూడా ఉంటుంది (ఉదాహరణకు: అనుమానాస్పద యాక్టివిటీని, అలాగే సమస్యాత్మకమైనవిగా ఫ్లాగ్ చేయబడిన ఇంటరాక్షన్లను రివ్యూ చేయడం).
      • డెవలపర్‌లు, హక్కుదారుల వంటి మా పార్ట్‌నర్‌లతో మా వాణిజ్య పార్ట్‌నర్‌లకు ఉన్న అనివార్య కార్యాలను నెరవేర్చేందుకు గాను (ఉదాహరణకు మేధో సంపత్తి హక్కుదారులు దాఖలు చేసే తీసివేత రిక్వెస్ట్‌లను అమలు చేయడం) అలాగే Googleకు చెందిన చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం కూడా ఈ సమాచారాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది.
    • మీ రిక్వెస్ట్‌కు సమాధానం ఇవ్వడానికి, ఉదాహరణకు నిర్దిష్ట కాంటాక్ట్ నుండి వచ్చిన ఈమెయిల్‌కు సారాంశాన్ని రాయడం వంటివి చేయడానికి, మీరు, Gemini యాప్స్‌కు అందించిన ఇతరుల వ్యక్తిగత డేటాను (మీరు, Gemini యాప్స్‌ను Google Workspace వంటి మరొక సర్వీస్‌తో ఇంటిగ్రేట్ చేయడం లాంటి చేసినప్పుడు సదరు డేటాను) ప్రాసెస్ చేస్తాము.
  • చట్టపరమైన బాధ్యతలు. వర్తించే ఏదైనా చట్టాన్ని, నియంత్రణా చట్టాన్ని, చట్టపరమైన ప్రక్రియను లేదా ఆంక్ష విధించబడే ప్రభుత్వ అభ్యర్థనను నెరవేర్చడానికి కూడా (ఉదాహరణకు సమాచారాన్ని అందించాల్సిందిగా ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థ నుండి మాకు చట్టపరమైన అభ్యర్థన అందితే) మేము మీ Gemini యాప్స్ సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాము.
  • మీ సమ్మతి. మీరు వాయిస్ మ్యాచ్ వంటి నిర్దిష్ట ఫీచర్‌లను ఉపయోగించేటప్పుడు మీ సమ్మతిపై ఆధారపడతాము. Gemini యాప్స్ అభివృద్ధి చెందే కొద్దీ, నిర్దిష్ట ప్రయోజనాల కోసం మీ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మేము మీ సమ్మతిని అడిగే అవకాశం ఉంది. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మీ సమ్మతిపై మేము ఆధారపడిన సందర్భాల్లో, మీ సమ్మతిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపసంహరించుకునే హక్కు మీకు ఉంటుంది.
నాకు యాడ్స్‌ను చూపించడం కోసం, మీరు నా Gemini యాప్స్ చాట్స్‌ను ఉపయోగిస్తారా?

మీ Gemini యాప్స్ చాట్స్‌, మీకు యాడ్స్‌ను చూపడానికి ఉపయోగించబడవు. ఇందులో మార్పు ఉంటే, మేము ఆ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాము.

మేము మా యూజర్‌ల డేటాను ఎలా ప్రైవేట్‌గా, సురక్షితంగా, భద్రంగా ఉంచుతాము అనే దాని గురించి తెలుసుకోవడానికి, మా గోప్యత, సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌ను చదవండి.

నా Google ఖాతా నుండి నేను, నా డేటాను యాక్సెస్ చేసి, తొలగించవచ్చా?

అవును, మీకు Gemini యాప్స్‌లో మీ Gemini యాప్స్ యాక్టివిటీకి తీసుకెళ్లే ఒక లింక్ కనబడుతుంది, అక్కడ మీ డేటాను మీరు మేనేజ్ చేయవచ్చు, తొలగించవచ్చు.

మీరు పిన్ చేసిన చాట్‌ల నుండి, అలాగే మీ ఇటీవలి చాట్‌ల నుండి ఏదైనా చాట్‌ను కూడా తొలగించవచ్చు. మీరు ఇలా చేసినప్పుడు, అది మీ Gemini యాప్స్ యాక్టివిటీ నుండి సంబంధిత యాక్టివిటీని కూడా తొలగిస్తుంది. చాట్‌లను మేనేజ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

మీ Gemini యాప్స్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం గురించి వివరాలు

Gemini యాప్స్ యాక్టివిటీ ఆన్‌లో ఉన్నప్పుడు, Google మీ Gemini యాప్స్ యాక్టివిటీని (ఉదాహరణకు మీ ప్రాంప్ట్‌లు, అవి ఇచ్చే సమాధానాలు, ఇంకా ఫీడ్‌బ్యాక్ మొదలైన సమాచారాన్ని) మీ Google ఖాతాలో స్టోర్ చేస్తుంది.

Gemini యాప్స్ యాక్టివిటీ ఆఫ్‌లో ఉన్నా కూడా మీ సంభాషణలు గరిష్ఠంగా 72 గంటల పాటు మీ ఖాతాలో సేవ్ అవుతాయి, దీని ద్వారా సర్వీస్‌ను అందించడానికి, ఏదైనా ఫీడ్‌బ్యాక్‌ను ప్రాసెస్ చేయడానికి మాకు వీలు అవుతుంది.

ఈ యాక్టివిటీ, మీ Gemini యాప్స్ యాక్టివిటీలో కనిపించదు.

మీ Gemini యాప్స్ యాక్టివిటీని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి

మీ Gemini యాప్స్ యాక్టివిటీలో, మీరు వీటిని ఎప్పుడైనా చేయవచ్చు:

  • Gemini యాప్స్ యాక్టివిటీని ఆఫ్ చేయడం.
  • మీ ప్రాంప్ట్‌లను రివ్యూ చేయడం
  • మీ Gemini యాప్స్ యాక్టివిటీని తొలగించడం
  • ఆటోమేటిక్ తొలగింపు సెట్టింగ్‌లను మార్చడం

Gemini యాప్స్ యాక్టివిటీ గురించి మరింత తెలుసుకోండి.

అంతే కాక, Google గోప్యతా పాలసీ, ఇంకా Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలలో వివరించిన విధంగా, మీ సమాచారాన్ని ఎగుమతి చేసుకోవచ్చు.

నా చాట్‌లను ఎవరు చూడగలరు, హ్యూమన్‌ రివ్యూ Geminiని ప్రతి ఒక్కరికీ ఎలా ఉపయోగపడేలా చేస్తుంది?

Google సర్వీస్‌లను మెరుగుపరచడంలో హ్యూమన్‌ రివ్యూ ఎలా సహాయపడుతుంది

Google సర్వీస్‌లను మెరుగుపరచడంలో సహాయం చేయడానికి, కొన్ని చాట్‌లను హ్యూమన్‌ రివ్యూవర్‌లు (Googleకు చెందిన ట్రెయినింగ్ పొందిన సర్వీస్ ప్రొవైడర్‌లతో సహా) రివ్యూ చేస్తారు. వీటిలో Gemini మోడల్స్‌, Gemini యాప్స్‌ పని చేయడానికి తోడ్పడే ఇతర జెనరేటివ్ AI మోడల్స్‌, అనుకోకుండా జరిగే యాక్టివేషన్‌లను తగ్గించడానికి సహాయపడే టెక్నాలజీలు ఉంటాయి.

రివ్యూవర్‌లు Gemini యాప్స్ సమాధానాలు తక్కువ నాణ్యతతో ఉన్నాయా, సరికానివిగా, లేదా హాని కలిగించేవిగా ఉన్నాయా అని అంచనా వేస్తారు. రివ్యూవర్‌లు మెరుగైన సమాధానాలను సూచిస్తారు. భవిష్యత్తులో మా మోడల్స్‌ మెరుగ్గా సమాధానాలు ఇచ్చేలా సహాయపడటానికి, వారి సూచనలను ఉపయోగిస్తాము.

ఈ ప్రాసెస్‌లో మేము మీ గోప్యతను ఎలా కాపాడతాము

మీ గోప్యతకు మేము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తాము, మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ విక్రయించము. సర్వీస్ ప్రొవైడర్‌కు పంపే ముందు, చాట్‌లు మీ ఖాతా నుంచి డిస్‌కనెక్ట్‌ అవుతాయి. రివ్యూ చేసిన చాట్‌లు మూడేళ్ల వరకు నిల్వ ఉంటాయి. 

రివ్యూవర్‌లతో షేర్ చేసే డేటాను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు

Google సర్వీస్‌లను మెరుగుపరచడానికి మీరు భవిష్యత్తులో చేసే చాట్‌లను రివ్యూ చేయకుండా ఉపయోగించకూడదని అనుకుంటే, యాక్టివిటీ సెట్టింగ్‌ను ఆఫ్‌ చేయండి. ఒక వేళ ఆ సెట్టింగ్‌ ఆన్‌లో ఉంటే, గోప్యమైన లేదా రివ్యూవర్‌ చూడకూడదు లేదా Google తన సర్వీస్‌లను మెరుగుపరచడానికి ఉపయోగించకూడదు అని అనుకునే డేటాను ఎంటర్‌ చేయొద్దు.

నేను Gemini యాప్స్ యాక్టివిటీని ఆఫ్ చేసిన తర్వాత Google నా సంభాషణలను ఎందుకు స్టోర్ చేస్తుంది, ఈ డేటాతో Google ఏమి చేస్తుంది?

మీకు సమాధానం ఇవ్వడానికి, Gemini యాప్స్‌ను మెయింటెయిన్ చేయడంలో, మెరుగుపరచడంలో సహాయం చేయడానికి, యూజర్‌లందరికీ సురక్షితమైన, మెరుగైన క్వాలిటీ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి మీరందించే ఫీడ్‌బ్యాక్‌ను సందర్భానుసారంగా అర్థం చేసుకోవడానికి, Googleకు ఈ సంభాషణలు అవసరం అవుతాయి.

Gemini యాప్స్ యాక్టివిటీని మీరు ఆఫ్ చేసిన తర్వాత కూడా, మీ ఖాతాలో స్టోర్ చేయబడి ఉండే సంభాషణల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ అందించబడ్డాయి:

మీరు Gemini యాప్స్‌లో ఫీడ్‌బ్యాక్‌ను ఇవ్వడానికి ముందు

  • Gemini యాప్స్ యాక్టివిటీ ఆఫ్‌లో ఉంటే, Google మీ సంభాషణలను 72 గంటల దాకా మీ ఖాతాలో స్టోర్ చేయడాన్ని కొనసాగిస్తుంది. ఈ యాక్టివిటీ, మీ Gemini యాప్స్ యాక్టివిటీలో కనిపించదు. ఇది కింది వాటి కోసం ఉపయోగించబడుతుంది:
    • మీ సంభాషణకు సందర్భానుసారంగా సమాధానాలను ఇవ్వడానికి. ఈ ప్రయోజనం కోసం, Gemini యాప్స్ కేవలం 24 గంటల డేటాను మాత్రమే ఉపయోగిస్తాయి.
    • Gemini యాప్స్‌నకు సంబంధించిన సేఫ్టీని, సెక్యూరిటీని మెయింటెయిన్ చేయడానికి, ఆ యాప్స్‌ను ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఈ ప్రయోజనం కోసం, Google సిస్టమ్‌లలో వైఫల్యం ఎదురైన సందర్భంలో బ్యాక్ ఎండ్ ప్రాసెస్‌లలోని డేటా అందుబాటులో ఉంటుందని నిర్ధారించుకోవడానికి గాను, Googleకు 72 గంటల నిల్వ కొనసాగింపు వ్యవధి అవసరం అవుతుంది.
  • మీరు Gemini యాప్స్ యాక్టివిటీని ఆఫ్ చేస్తే, మీ ఖాతాలో స్టోర్ అయ్యే కొత్త సంభాషణలను, Google తన జెనరేటివ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి ఉపయోగించదు. మీరు ఏదైనా ఒక సంభాషణపై ఫీడ్‌బ్యాక్ ఇస్తే సదరు సంభాషణను మాత్రం ఉపయోగిస్తుంది.

మీరు Gemini యాప్స్‌లో ఫీడ్‌బ్యాక్‌ను అందించిన తర్వాత

మీరు Googleకు ఫీడ్‌బ్యాక్‌ను పంపాలని నిర్ణయించుకుంటే, Google సిస్టమ్‌లు కింది సమాచారాన్ని సేకరిస్తాయి:

  • మీ ఫీడ్‌బ్యాక్.
  • ఫీడ్‌బ్యాక్‌లో చేర్చబడిన ఏదైనా కంటెంట్, అంటే మీరు అప్‌లోడ్ చేసే ఫైల్స్, ఇమేజ్‌ల వంటివి. అంతే కాకుండా, కనెక్ట్ అయి ఉన్న యాప్స్ నుండి Gemini తీసుకునే మీ వ్యక్తిగత కంటెంట్ కూడా.
  • మీ ఫీడ్‌బ్యాక్‌ను బాగా అర్థం చేసుకోవడానికి మాకు ఉపయోగపడే సందర్భం (కాంటెక్ట్స్). మీ ప్రాంప్ట్‌లు, Gemini యాప్స్ సమాధానాల వంటి అందుబాటులో ఉన్న గత 24 గంటల సంభాషణ డేటా ఇందులో భాగంగా ఉంటుంది.

"Google నా ఫీడ్‌బ్యాక్‌ను ఎలా ఉపయోగిస్తుంది" అనే విషయం తెలుసుకోండి.

Google నా ఫీడ్‌బ్యాక్‌ను ఎలా ఉపయోగిస్తుంది?

మీ ఫీడ్‌బ్యాక్, ఏదైనా చేర్చబడిన కంటెంట్ (ఉదా. ఫైల్స్ లేదా కనెక్ట్ అయి ఉన్న యాప్స్ నుండి అందే మీ వ్యక్తిగత కంటెంట్), అనుబంధ సంభాషణలు (ఉదా. మీ ప్రాంప్ట్‌లు, Gemini యాప్స్ సమాధానాలు), అలాగే సంబంధిత డేటాను:

  • ప్రత్యేక ట్రెయినింగ్ పొందిన టీమ్‌లలోని మెంబర్లు రివ్యూ చేస్తారు. సమస్యలుగా మారడానికి అవకాశం ఉన్న అంశాలను ఫీడ్‌బ్యాక్‌లో ఏమైనా మెన్షన్ చేసి ఉంటే వాటిని గుర్తించడానికి, పరిష్కరించడానికి, రిపోర్ట్ చేయడానికి హ్యూమన్ రివ్యూ అవసరం అవుతుంది. కొన్ని సందర్భాల్లో, ఈ రివ్యూ చట్టం ప్రకారం తప్పనిసరి.
  • Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగించడం జరుగుతుంది. Google ప్రోడక్ట్‌లను, సర్వీస్‌లను, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను అందించడానికి, మెరుగుపరచడానికి, డెవలప్ చేయడానికి Google ఈ డేటాను ఉపయోగిస్తుంది. దీని గురించి మా గోప్యతా పాలసీలో మరింత లోతుగా వివరించాము.
    • ఉదాహరణకు, Gemini యాప్స్‌ను మరింత సురక్షితంగా చేయడానికి మేము ఈ డేటాను ఉపయోగిస్తాము. భవిష్యత్తులో సురక్షితం కాని రిక్వెస్ట్‌లను లేదా సమాధానాలను గుర్తించి, వాటిని నివారించడంలో ఇది మాకు సహాయపడుతుంది.
  • 3 సంవత్సరాల వరకు స్టోర్ చేసి ఉంచడం జరుగుతుంది. రివ్యూ చేయబడిన ఫీడ్‌బ్యాక్, అనుబంధంగా ఉన్న సంభాషణలు, సంబంధిత డేటా, మీ Google ఖాతా నుండి డిస్‌కనెక్ట్ అయ్యి 3 ఏళ్ల దాకా స్టోర్ చేయబడుతుంది.

Gemini యాప్స్ గురించి ఫీడ్‌బ్యాక్‌ను ఎలా పంపాలో, లేదా వాటి విషయంలో ఎదురయ్యే సమస్యను ఎలా రిపోర్ట్ చేయాలో తెలుసుకోండి.

Gemini కొత్తదే కాదు, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అనడంలో ఉద్దేశం ఏమిటి?

జేమ్స్ మన్యీకా (Google SVP, టెక్నాలజీ అండ్ సొసైటీ) రాసిన ఈ Bard ఓవర్‌వ్యూలో వివరించినట్టుగా Gemini యాప్స్ (మునుపు Bard అని పిలిచే వారు) అనేవి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆధారంగా పని చేస్తాయి. దాదాపు అన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMలు) మాదిరి గానే, పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న సోర్స్‌ల నుండి వివిధ రకాల డేటాను Gemini యాప్స్‌ను నడిపించే మోడల్స్‌కు అందించడం ద్వారా ముందస్తు ట్రెయినింగ్ ఇవ్వబడింది.

LLMలు ఎలా పని చేస్తాయి

ఈ ముందస్తు ట్రెయినింగ్‌తో, LLMలు, లాంగ్వేజ్ ప్యాటర్న్‌లను కనుగొంటాయి. సంభాషణలో తర్వాత ఏ పదం వస్తుంది లేదా ఏ పదాలు వస్తాయి అన్నది అంచనా వేయడానికి ఈ ప్యాటర్న్‌లను ఉపయోగిస్తాయి. అయితే, LLM గనుక, తర్వాత రావడానికి అత్యంత ఎక్కువగా అవకాశం ఉన్న పదాన్ని మాత్రమే ఎంచుకుంటే, సమాధానాలు అంత సృజనాత్మకంగా ఉండకపోవచ్చు. అందుకే LLMలకు పదాల ఎంపికలో కొంతమేర స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. మరింత ఆసక్తికరమైన సమాధానాలను జెనరేట్ చేసేందుకు గాను, పలు సమాధానాల నుండి ఒక దానిని ఎంచుకునే వెసులుబాటు సాధారణంగా వాటికి ఇవ్వబడుతుంది, ఈ సమాధానాలు సమంజసంగా ఉంటూనే వ్యక్తులు ఊహించే వాటికి కొంచెం భిన్నంగా ఉంటాయి.

ఎందుకు సమాధానాలు ఎల్లప్పుడూ ఖచ్చితంగా ఉండవు

LLMలు కొన్ని సమయాల్లో వాస్తవ ప్రాంప్ట్‌లపై మంచి పనితీరును కనబరిచి, సమాచారాన్ని మరొక చోటి నుండి పొందుతున్నట్లు అనిపించేలా చేయగలవు, కానీ అవి సమాచార డేటాబేస్‌లు గానీ సమాచారాన్ని కలెక్ట్ చేసే సిస్టమ్‌లు గానీ కావు. మీరు ఒక డేటాబేస్ క్వెరీని రన్ చేసినప్పుడు, ప్రతిసారీ ఒకే రకమైన సమాధానాన్ని ఆశించవచ్చు. కానీ, మీరు LLMకు అదే ప్రాంప్ట్‌ను ఇచ్చినప్పుడు, దాని నుండి వచ్చే సమాధానం ప్రతిసారీ ఒకే విధంగా ఉండాలన్న నియమం లేదు లేదా LLMకు ట్రెయినింగ్ ఇవ్వడానికి ఉపయోగించిన వాస్తవ సమాచారాన్ని కూడా అది అందించదు. ఎందుకంటే LLMలు సంభాషణలో తర్వాతి పదాన్ని అంచనా వేయగలిగేలా ట్రెయినింగ్ ఇవ్వబడ్డాయి, సమాచారాన్ని పొందడానికి కాదు.

LLMలు, వ్యక్తుల గురించి, ఇతర టాపిక్‌ల గురించి వాస్తవికంగా తప్పులను కలిగి ఉన్నా ఆమోదయోగ్యం-అనిపించే సమాధానాలను జెనరేట్ చేయడానికి గల కారణాలలో ఇది ఒక ముఖ్యమైన అంశం. వాస్తవికతకు అధిక ప్రాధాన్యత ఉండే సందర్భాలకు ఇది అనువైనది కాదు; కానీ క్రియేటివ్‌గా ఉండేలా, లేదా ఊహించని సమాధానాలను జెనరేట్ చేయడంలో ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

Gemini యాప్స్ కొత్తవని, అభివృద్ధి చెందుతున్నాయని అనడానికి కారణం ఏంటి

LLMలను బాధ్యతాయుతంగా డెవలప్ చేయడానికి మేము దీర్ఘకాలంగా కొనసాగిస్తున్న కృషిలో Gemini యాప్స్ ఒక భాగమని చెప్పవచ్చు. ఈ క్రమంలో, LLMలతో అనుబంధించబడిన అనేక పరిమితులను మేము కనుగొని వాటిని చర్చించాము, వీటిలో మేము పని చేయడాన్ని కొనసాగిస్తున్న ఐదు అంశాలను ఇక్కడ పేర్కొంటున్నాము:

  • ఖచ్చితత్వం: వ్యక్తులు, ఇతర టాపిక్‌ల గురించి Gemini యాప్స్ సమాధానాలు తప్పుగా ఉండవచ్చు, ముఖ్యంగా సంక్లిష్టమైన లేదా వాస్తవిక సమస్యల విషయంలో ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
  • పక్షపాతం: వ్యక్తులు, ఇతర టాపిక్‌ల గురించి Gemini యాప్స్ ఇచ్చే సమాధానాలు, దాని ట్రెయినింగ్ డేటాను అనుసరించి, ఒకవైపు మొగ్గు చూపేవిగా, లేదా ఆ డేటాలో ఇమిడి ఉన్న దృష్టికోణాన్ని ప్రతిబింబించేవిగా ఉండవచ్చు.
  • వ్యక్తిగత శైలి: Gemini యాప్స్ సమాధానాలను బట్టి చూస్తే, దానికి వ్యక్తిగత అభిప్రాయాలు లేదా ఫీలింగ్స్ ఉన్నట్లు అనిపించవచ్చు.
  • తప్పుడు పాజిటివ్‌లు, తప్పుడు నెగిటివ్‌లు: సరిగ్గా ఉన్న కొన్ని ప్రాంప్ట్‌లకు Gemini యాప్స్ సమాధానం ఇవ్వకపోవచ్చు, అలాగే కొన్ని ఇతర ప్రాంప్ట్‌లకు అనుచితమైన సమాధానాలను ఇవ్వవచ్చు.
  • దుర్వినియోగ ప్రాంప్ట్‌ల వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం: యూజర్‌లు Gemini యాప్స్‌ను ఇబ్బంది పెట్టే దారులను వెతుకుతూనే ఉంటారు. ఉదాహరణకు, వారు వ్యక్తుల గురించి, ఇతర టాపిక్‌ల గురించి ట్రెయినింగ్‌పై ఆధారితం కాని సమాధానాలను ఇచ్చేలా చేసి, సరికాని సమాచారాన్ని అందించేలా Gemini యాప్స్‌ను ప్రాంప్ట్ చేయవచ్చు.

Gemini యాప్స్‌ను లాంచ్ చేసే ముందే ఇలాంటి సమస్యలను పరిష్కరించడంపై మేము దృష్టి సారించాము. అలాగే, ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి గాను ఈ రంగంలో ఉన్న ఇతరులతో పాటు మేము కూడా రీసెర్చ్‌ను కొనసాగిస్తాము. Googleలో దీనిని కాలక్రమేణా మరింత మెరుగుపరిచేలా కృషి చేసేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మరింత తెలుసుకోండి.

సమాధానాలను పర్సనలైజ్ చేయడానికి నా డేటాను Gemini యాప్స్ ఉపయోగించాలా వద్దా అనే దాన్ని నేను ఎలా కంట్రోల్ చేయాలి?
మీ ప్రాంతం, సెట్టింగ్స్ ఆధారంగా Gemini యాప్స్ మీ Search హిస్టరీని ఉపయోగించి మీ ఎక్స్‌పీరియన్స్‌ను పర్సనలైజ్ చేయగలవు. మీ Search హిస్టరీని పర్సనలైజేషన్ కోసం ఉపయోగించాలా వద్దా అనే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోండి.
సమాచారాన్ని సేవ్ చేయమని నేను Gemini యాప్స్‌ను అడిగినప్పుడు ఏమవుతుంది?

మీరు సేవ్ చేసిన సమాచారం సెట్టింగ్లో సేవ్ చేయమని Geminiని కోరే సమాచారం, Gemini యాప్స్‌లో మరింత సందర్భోచితమైన సమాధానాలను అందించడానికి ఉపయోగించబడుతుంది. 

మీరు సమాచారాన్ని తొలగించే వరకు అది సేవ్ అయ్యి ఉంటుంది, ఈ సెట్టింగ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేయవచ్చు. సేవ్ చేసిన సమాచారాన్ని ఎలా తొలగించాలో లేదా ఈ సెట్టింగ్‌ను ఎలా ఆఫ్ చేయాలో తెలుసుకోండి.

లొకేషన్, ఇతర అనుమతుల సమాచారం

Gemini యాప్స్ ఏ లొకేషన్ సమాచారాన్ని సేకరిస్తాయి, అది ఎందుకు, ఎలా ఉపయోగించబడుతుంది?

మీరు Gemini యాప్స్‌ను ఉపయోగించినప్పుడల్లా, లొకేషన్ డేటా సేకరించబడుతుంది, తద్వారా అవి మీ క్వెరీకి తగిన సమాధానాన్ని ఇస్తాయి. ఉదాహరణకు, "వాతావరణం ఎలా ఉంది?" వంటి ప్రాంప్ట్‌లకు సమాధానం ఇవ్వడానికి, Gemini యాప్స్‌కు మీ లొకేషన్‌ను తెలుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Gemini యాప్స్, లొకేషన్ డేటాను ఎక్కడ పొందుతాయి, అది ఎలా ఉపయోగించబడుతుంది

Gemini యాప్స్ సేకరించే లొకేషన్ డేటాకు చెందిన సోర్స్ అనేది, మారుతూ ఉంటుంది. "వాతావరణం ఎలా ఉంది?" వంటి ప్రాంప్ట్‌లకు సమాధానాలను ఇవ్వడం కోసం Gemini యాప్స్ ఆటోమేటిక్‌గా మీ IP అడ్రస్, లేదా మీ Google ఖాతాలోని ఇంటి లేదా ఆఫీస్ అడ్రస్‌ల నుండి జనరల్ ఏరియాను ఉపయోగిస్తాయి

మీ అనుమతి పొందిన తర్వాత, మీ పరికరానికి చెందిన ఖచ్చితమైన లొకేషన్‌ను కూడా Gemini యాప్స్ ప్రాసెస్ చేస్తాయి, తద్వారా మరింత సందర్భోచితమైన సమాధానాలను అందిస్తాయి. ఉదాహరణకు, "నాకు అత్యంత సమీపంలోని కాఫీ షాప్ ఎక్కడ ఉంది?" వంటి ప్రాంప్ట్‌లకు మరింత ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి Gemini యాప్స్ మీ ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించవచ్చు.

Google మీ ఖచ్చితమైన లొకేషన్ డేటాతో సహా, మీ లొకేషన్ డేటాను కూడా Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో వివరించిన ప్రయోజనాల కోసం, చట్టపరమైన ప్రాతిపదికలకు అనుగుణంగా ఉపయోగిస్తుంది. g.co/privacypolicy/location లింక్ వద్ద లొకేషన్ డేటా గురించి మరింత తెలుసుకోండి.

ఖచ్చితమైన లొకేషన్ డేటా ఏ విధంగా షేర్ చేయబడుతుంది

అందుబాటులో ఉంటే, Gemini యాప్స్ మీ రిక్వెస్ట్‌ను నెరవేర్చడానికి Google Maps వంటి మరొక Google సర్వీస్‌తో మీ ఖచ్చితమైన లొకేషన్ డేటాను షేర్ చేయవచ్చు. మీ లొకేషన్ డేటాను పొందే Google సర్వీస్ దానిని Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగిస్తుంది.

లొకేషన్ డేటా ఎలా స్టోర్ చేయబడుతుంది

  • మీ Gemini యాప్స్ యాక్టివిటీలో ఖచ్చితమైన లొకేషన్ స్టోర్ చేయబడదు.
  • Gemini యాప్స్ ప్రాసెస్ చేసే లొకేషన్ డేటా, ఎగ్జాక్ట్ లొకేషన్‌ను గుర్తించకుండా జనరల్ ఏరియాగా మార్చబడుతుంది. ఆ తర్వాతే మీ Gemini యాప్స్ యాక్టివిటీలో స్టోర్ అవుతుంది. జనరల్ ఏరియా 3 చదరపు కిలోమీటర్ల కంటే పెద్దదిగా, కనీసం 1000 మంది యూజర్‌లను కలిగి ఉంటుంది, తద్వారా మీ ప్రాంప్ట్ జనరల్ ఏరియా మిమ్మల్ని గుర్తించదు, ఇది మీ గోప్యతను రక్షించడంలో సహాయపడుతుంది. జనరల్ ఏరియాను నగరాల వెలుపల పరిగణించినట్లయితే, అది సాధారణంగా 3 చదరపు కిలోమీటర్‌ల కంటే ఎక్కువ విస్తీర్ణం గల ప్రాంతాన్ని సూచిస్తుందని దీని అర్థం.

మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి

ఎప్పుడైనా, మీరు వీటిని చేయవచ్చు:

నా ఖచ్చితమైన లొకేషన్‌ను Gemini యాప్స్‌ యాక్సెస్ చేస్తున్నాయా, చేస్తుంటే ఉపయోగిస్తున్నాయా అన్నది నాకు ఎలా తెలుస్తుంది?

Gemini వెబ్ యాప్

Gemini వెబ్ యాప్ మెనూకు దిగువున, యూజర్-ఇంటర్‌ఫేస్ ఎలిమెంట్‌లను చూపుతుంది; ఇవి, ఈ యాప్ ద్వారా ప్రాసెస్ చేయబడిన లొకేషన్ డేటా గురించి ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఉంటాయి.

gemini.google.com మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్ చేసి, ఉపయోగిస్తోందో లేదో చెక్ చేయడానికి:

  1. gemini.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఎగువున ఎడమ వైపు, మెనూ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మెనూ దిగువున, లొకేషన్ పక్కన ఉన్న డాట్‌ను చెక్ చేయండి.
    • డాట్ నీలం రంగులో ఉంటే, gemini.google.com మీ ఖచ్చితమైన లొకేషన్‌కు యాక్సెస్‌ను పొందుతూ, దాన్ని ఉపయోగిస్తోందని అర్థం.
    • డాట్ బూడిద రంగులో ఉంటే, gemini.google.com మీ ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించడం లేదని అర్థం.

Gemini మొబైల్ యాప్ (Androidలో)

మీరు Gemini యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ, Geminiని Google యాప్ హోస్ట్ చేస్తోంది. Gemini మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్ చేసి, ఉపయోగిస్తోందో లేదో చెక్ చేయడానికి:

  1. మీ Android డివైజ్‌లో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. లొకేషన్ ఆ తర్వాతయాప్ లొకేషన్ అనుమతులు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Google Google శోధనను ట్యాప్ చేయండి.
  4. “ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించండి” ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి.
    • ఆన్‌లో ఉంటే గనుక, Google యాప్‌లో Geminiతో పాటు ఇతర సర్వీస్‌లు (Search వంటివి) మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్ చేసి ఉపయోగించగలవు.
    • ఆఫ్‌లో ఉంటే గనుక, Google యాప్‌లో Geminiతో పాటు ఇతర సర్వీస్‌లు (Search వంటివి) మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్ చేసి ఉపయోగించలేవు.
  5. యాప్ కోసం లొకేషన్ యాక్సెస్‌ను ఎంచుకోండి: ఎల్లప్పుడూ అనుమతించండి, యాప్‌ను ఉపయోగించే సమయంలో మాత్రమే అనుమతించండి, ప్రతిసారి అడగాలి, లేదా అసలు అనుమతించకండి అనే ఆప్షన్‌ల మధ్య ఎంచుకోండి.

Gemini మొబైల్ యాప్ (iOSలో)

Google యాప్‌లో Gemini మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్ చేసి, ఉపయోగిస్తోందో లేదో చెక్ చేయడానికి:

  1. మీ iPhoneలో, సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. గోప్యత & సెక్యూరిటీ ఆ తర్వాత లొకేషన్ సర్వీస్‌లను ట్యాప్ చేయండి.
  3. Google ను ట్యాప్ చేయండి.
  4. “ఖచ్చితమైన లొకేషన్” ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి .
    • ఆన్‌లో ఉంటే గనుక, Google యాప్‌లో Geminiతో పాటు ఇతర సర్వీస్‌లు (Search వంటివి) మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్ చేసి ఉపయోగించగలవు.
    • ఆఫ్‌లో ఉంటే , Google యాప్‌లో Geminiతో పాటు ఇతర సర్వీస్‌లు (Search వంటివి) మీ ఖచ్చితమైన లొకేషన్‌ను ఉపయోగించడం లేదు.
  5. యాప్ కోసం లొకేషన్ యాక్సెస్‌ను ఎంచుకోండి: ఎల్లప్పుడూ, యాప్‌ను ఉపయోగించే సమయంలో, తదుపరి సారి ఉపయోగించినప్పుడు అడగాలి లేదా నేను షేర్ చేసినప్పుడు అడగాలి లేదా ఎప్పటికీ వద్దు అనే ఆప్షన్‌ల మధ్య ఎంచుకోండి.

Google Messagesలో Gemini

Google Messagesలోని Geminiకి మీ ఖచ్చితమైన లొకేషన్‌కు యాక్సెస్ లేదు. 'Google Messagesలో Gemini' ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో తెలుసుకోండి.

మీ లొకేషన్ గురించి, దానిని ఎలా మేనేజ్ చేయాలి అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

Chromeలో Gemini

Chromeలో Gemini ఫీచర్‌ మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్ చేసి, ఉపయోగిస్తోందో లేదో చెక్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, Chromeను తెరవండి.
  2. ఎగువున కుడివైపు ఉన్న, మరిన్ని ఆ తర్వాతసెట్టింగ్‌లు ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. AI ఆవిష్కరణలు విభాగంలో Chromeలో Gemini  ఆ తర్వాత అనుమతులును క్లిక్‌ చేయండి.
  4. “ఖచ్చితమైన లొకేషన్” ఆప్షన్ ఆన్‌లో ఉందో లేదో చెక్ చేయండి.
    • అది ఆన్‌లో ఉంటే , Gemini మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్‌ చేయగలదు.
    • అది ఆఫ్‌లో ఉంటే , Gemini మీ ఖచ్చితమైన లొకేషన్‌ను యాక్సెస్‌ చేయడం గానీ, ఉపయోగించడం గానీ చేయలేదు, మీ IP అడ్రస్‌ నుండి ఎస్టిమేటెడ్ లొకేషన్‌ను పొందగలుగుతుంది.
Gemini నా డివైజ్ అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు, నా మొబైల్ అనుమతులను నేనెలా మేనేజ్ చేసుకోవాలి?

Gemini మొబైల్ యాప్ (Androidలో)

మీరు Gemini యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ, Geminiని Google యాప్ హోస్ట్ చేస్తోంది. మీ Google యాప్ అనుమతుల ఆధారంగా, మీ డివైజ్‌లోని అనేక ఫీచర్‌లను, సామర్థ్యాలను (మీ కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్‌లు, లేదా లొకేషన్ వంటివి) Gemini, Google యాప్ ఉపయోగించగలవు. ఈ అనుమతులను రివ్యూ చేయడంతో సహా మేనేజ్ చేయడానికి:

  1. Google యాప్ Google శోధనను నొక్కి, పట్టుకోండి.
  2. యాప్ సమాచారం ఆ తర్వాత అనుమతులను ట్యాప్ చేయండి.
  3. ఏదైనా అనుమతి సెట్టింగ్‌ను మార్చడానికి, దాన్ని ట్యాప్ చేసి, అనుమతించండిని కానీ, లేదా అనుమతించవద్దును కానీ ఎంచుకోండి.

అప్‌లోడ్ చేసిన ఫైల్స్

నేను అప్‌లోడ్ చేసిన ఇమేజ్‌లతో Google ఏమేమి చేస్తుంది?

ప్రాంప్ట్‌లలో ఇమేజ్‌లను జోడించడం అనేది ఎలా పని చేస్తుంది

మీరు మీ ప్రాంప్ట్‌కు ఇమేజ్‌ను జోడించినప్పుడు, లేదా "ఈ స్క్రీన్ గురించి అడగండి" వంటి స్క్రీన్ చర్యల ద్వారా స్క్రీన్‌షాట్‌ను జోడించినప్పుడు, ఇమేజ్‌లో ఏముందో అర్థం చేసుకోవడానికి, టెక్ట్స్‌ను చదవడానికి Gemini యాప్స్‌ Google Lens టెక్నాలజీని కూడా ఉపయోగిస్తాయి. ఉదాహరణకు, ఇమేజ్‌లోని పిక్సెల్స్‌ను విశ్లేషించి, అవి ఎగిరి దుంకుతోన్న పిల్లికి చెందినవి అని Google Lens అర్థం చేసుకోవచ్చు. మీ రిక్వెస్ట్‌ను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి Gemini యాప్స్ ఈ సమాచారాన్ని మీ ప్రాంప్ట్‌కు జోడిస్తాయి. Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో వివరించినట్లుగా, ఈ సమాచారాన్ని కూడా ఇతర ప్రాంప్ట్ లాగానే Google ఉపయోగిస్తుంది.

మీరు వాస్తవ ఇమేజ్‌లను ఉపయోగించడాన్ని మేము ఎలా కంట్రోల్ చేస్తాము

మీరు అప్‌లోడ్ చేసే వాస్తవ ఇమేజ్‌లను, మీరు వాటిని ఫీడ్‌బ్యాక్‌లో చేరిస్తే తప్ప, ప్రస్తుతం వాటిని మా జెనరేటివ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను మెరుగుపరచడానికి ఉపయోగించము. మీరు ఏదైనా ఒక Gemini యాప్ సమాధానంపై ఫీడ్‌బ్యాక్‌ను సమర్పించినట్లయితే, మీరు సమ్మతిని నిలిపివేస్తే తప్ప, ఆ సమాధానానికి ముందు, సదరు సంభాషణలో చివరగా మీరు అప్‌లోడ్ చేసిన ఇమేజ్ కూడా మీ ఫీడ్‌బ్యాక్‌లో భాగంగా మారుతుంది. మీరు అందించే ఇతర ఫీడ్‌బ్యాక్ లాగానే ఈ డేటాను కూడా Google ఉపయోగిస్తుంది. Google మీ ఫీడ్‌బ్యాక్‌ను ఎలా ఉపయోగిస్తుంది అనే దాని గురించి మరింత తెలుసుకోండి.

మేము కొత్త ఫీచర్‌లను అందిస్తూ, మా సర్వీస్‌లను మెరుగుపరిచే క్ర‌మంలో, మీ ఇమేజ్‌లను వేరే అవసరాల కోసం ఉపయోగిస్తే, ఆ విషయాన్ని పారదర్శకంగా తెలియజేస్తాము.

నేను అప్‌లోడ్ చేసిన ఫైళ్లను Google ఎలా ఉపయోగిస్తుంది?

మీ ప్రాంప్ట్‌తో పాటు ఏదైనా ఒక ఫైల్‌ను మీరు అప్‌లోడ్ చేసినప్పుడు, దానిని Gemini యాప్స్ మీ ప్రాంప్ట్‌కు అనుబంధంగా ఇంటర్‌ప్రెట్ చేస్తాయి (అర్థం చేసుకుంటాయి). ఇందులో భాగంగా, సమాధానంలో ఫైల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి ఆ ఫైల్‌ను విశ్లేషించడం కూడా ఉండవచ్చు.

మీరు అప్‌లోడ్ చేసిన ఫైల్స్‌ను మీ ఫీడ్‌బ్యాక్‌లో చేర్చితే తప్ప, Google ప్రస్తుతం వాటిని ఉపయోగించి తన జెనరేటివ్ AI మోడల్స్‌కు ట్రెయినింగ్ ఇవ్వదు.

కొత్త ఫీచర్‌లను అందిస్తూ, మా సర్వీస్‌లను మెరుగుపరిచే క్రమంలో, మీరు అప్‌లోడ్ చేసే ఫైళ్లను వేరే అవసరాల కోసం ఉపయోగిస్తే, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాము.

 

 

Geminiలో కనెక్ట్ అయి ఉన్న యాప్స్

కనెక్ట్ అయి ఉన్న యాప్స్‌తో Gemini షేర్ చేసే నా డేటా విషయంలో ఏం జరుగుతుంది?

పనులను పూర్తి చేసుకోవడంలో మీకు మెరుగ్గా సహాయపడటానికి, యాప్స్ అనే సర్వీస్‌లకు Gemini కనెక్ట్ కాగలదు, ఆ పనుల్లో కొన్ని ఉదాహరణలను ఈ కింద అందించాము:

  • మీకు సమాధానం ఇవ్వడానికి సంబంధిత సమాచారాన్ని కనుగొనడం
  • మీ కోసం యాక్షన్స్ తీసుకోవడం

Gemini కనెక్ట్ కాగల యాప్స్ గురించి మరింత తెలుసుకోండి.

ఏ డేటా షేర్ చేయబడుతుంది

మీ రిక్వెస్ట్‌లను ఫుల్‌ఫిల్ చేయడానికి Gemini, కనెక్ట్ అయి ఉన్న యాప్స్‌తో, ఈ కింద ఉన్న డేటాను షేర్ చేసే అవకాశం ఉంది:

  • మీ సంభాషణకు, పరికరానికి సంబంధించిన సమాచారం
  • భాష తదితర ప్రాధాన్యతలు
  • లొకేషన్ సమాచారం

అలాగే, Gemini, మీ అనుమతి తీసుకుని, మీరెవరు అన్నది కొన్ని యాప్స్‌కు తెలియజేస్తుంది. ఇతర సర్వీస్‌లలో ఉన్న మీ వ్యక్తిగత సమాచారాన్ని, కంటెంట్‌ను Gemini యాప్స్‌కు ఇవ్వడానికి ఇలా చేయాల్సి ఉంటుంది. తద్వారా అవి మీ రిక్వెస్ట్‌లను ఫుల్‌ఫిల్ చేయగలవు. Geminiలో యాప్స్‌ను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

ముఖ్య గమనిక: ఇతర సర్వీస్‌లలో షేర్ అయిన కంటెంట్‌ను మార్చమని, లేదా షేర్ అయిన డివైజ్‌లను కంట్రోల్ చేయమని మీరు Gemini యాప్స్‌కు చెబితే, షేర్ అయిన సదరు కంటెంట్‌కు లేదా డివైజ్‌కు యాక్సెస్ ఉన్న వారెవరైనా ఆ చర్యలను చూడటానికి అవకాశం ఉంది.

ఇతర Google సర్వీస్‌లు షేర్ అయిన డేటాను ఎలా ఉపయోగిస్తాయి

ఇతర Google సర్వీస్‌లకు షేర్ చేసిన సమాచారాన్ని Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఈ అవసరాల కోసం వినియోగిస్తాం:

  • మీ రిక్వెస్ట్‌ను ఫుల్‌ఫిల్ చేయడానికి, మీకు సర్వీస్‌లను ప్రొవైడ్ చేయడానికి
  • APIల వంటి యాప్స్‌తో Geminiని ఇంటిగ్రేట్ చేసే Google టెక్నాలజీలను మెయింటైన్ చేయడానికి
  • మీకు, ఇతర Google యూజర్‌లకు మెరుగ్గా సమాధానం ఇచ్చేందుకు ఆ సర్వీస్‌లను మెరుగుపరచడానికి

ఇతర Google సర్వీస్‌లు షేర్ అయిన డేటాను ఎలా తొలగిస్తాయి

Google సర్వీస్‌లకు డేటాను షేర్ చేసినప్పుడు, పైన లిస్ట్ చేసిన ప్రయోజనాల కోసం దాన్ని ఇక కొనసాగించాల్సిన అవసరం లేకపోతే, సదరు డేటా ఆటోమేటిక్‌గా తొలగించబడుతుంది. కలెక్ట్ చేసే డేటాను Google ఏ విధంగా స్టోర్ చేస్తుంది అనే ఆర్టికల్‌లో వివరించిన విధంగా, ఈ తొలగింపు ఉంటుంది. మీ Gemini యాప్స్ యాక్టివిటీ నుండి సంబంధిత సంభాషణను మీరు తొలగిస్తే, అది ఇతర సర్వీస్‌ల నుండి షేర్ చేసిన సమాచారాన్ని తొలగించదు.

షేర్ అయిన డేటాను థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లు ఎలా ఉపయోగిస్తాయి, ఎలా తొలగిస్తాయి

షేర్ అయిన డేటాను థర్డ్-పార్టీ యాప్‌లు, సర్వీస్‌లు వాటి స్వంత గోప్యతా పాలసీలకు అనుగుణంగా ఉపయోగిస్తాయి. మీరు థర్డ్-పార్టీ యాప్‌ను లేదా సర్వీస్‌ను ఉపయోగించే ముందు దయచేసి ఆ పాలసీలను జాగ్రత్తగా రివ్యూ చేయండి.

మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి

  • Gemini సెట్టింగ్‌లలోని యాప్స్ పేజీకి వెళ్లి, Gemini ఏ యాప్స్‌కు కనెక్ట్ కావాలి అన్నది మీరు ఏ సమయంలోనైనా మేనేజ్ చేయవచ్చు.
  • మీ Gemini యాప్స్ యాక్టివిటీని మీరు ఆఫ్ చేస్తే, యాప్స్ డిజేబుల్ అయిపోతాయి. మీ Gemini యాప్స్ యాక్టివిటీని మీరు ఆన్ చేస్తే, కనెక్ట్ అయి ఉండే ఏ యాప్స్ అయినా మళ్ళీ ఎనేబుల్ అవుతాయి.
కనెక్ట్ అయి ఉన్న యాప్స్ నుండి Gemini యాప్స్‌కు అందే నా డేటా విషయంలో ఏం జరుగుతుంది?

Gemini యాప్స్‌ను ఈ కింద పేర్కొన్న వాటితో కనెక్ట్ చేయడంలో సాయం కోసం మీరు యాప్స్‌ను ఉపయోగించవచ్చు:

  • మీ డివైజ్‌లో, ఇతర టూల్స్‌లో, యాప్స్‌లో, అలాగే సర్వీస్‌లలో ఉన్న మీ వ్యక్తిగత సమాచారంతో, కంటెంట్‌తో. దీని వలన Gemini యాప్స్ మీకు మరింత మెరుగ్గా సమాధానం ఇవ్వగలవు.
  • ఇతర Google సర్వీసులను కనెక్ట్ చేస్తే, Gemini యాప్స్ మీరు రిక్వెస్ట్ చేసిన పనులను ఆ సర్వీసుల్లో పూర్తి చేస్తాయి.

Gemini కనెక్ట్ కాగల యాప్స్ గురించి మరింత తెలుసుకోండి.

డేటా ఎలా ఉపయోగించబడుతుంది

కనెక్ట్ అయి ఉన్న యాప్స్ నుండి అందే మీ వ్యక్తిగత డేటాను (మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, మీ ప్రైవేట్ కంటెంట్ వంటి వాటిని) Gemini ప్రాసెస్ చేసి, ఇందుకు ఉపయోగిస్తుంది:

  • మీరు అడిగినప్పుడు Gemini యాప్స్ ఫీచర్లను అందించడానికి. ఉదాహరణకు:
  • Gemini యాప్స్ సర్వీస్‌లను మెయింటైన్ చేయడానికి. ఉదాహరణకు:
    • సర్వీస్‌లు క్రాష్ అయినప్పుడు రికవర్ చేయడం
    • ఓవరాల్‌గా యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో మెజర్ చేయడానికి

Google సర్వీస్‌ల నుండి Gemini యాప్స్‌కు అందే మీ వ్యక్తిగత కంటెంట్‌ను:

  • రివ్యూవర్‌లు యాక్సెస్ కానీ, రివ్యూ కానీ చేయలేరు
  • Gemini యాప్స్‌కు ఆధారితమైన జెనరేటివ్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలను ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించబడదు
  • మీకు యాడ్‌లను చూపించేందుకు Gemini యాప్స్ మీ వ్యక్తిగత కంటెంట్‌ను ఉపయోగించవు
  • Gemini యాప్స్ సర్వీస్‌లను ప్రొవైడ్ చేయడానికి, మెయింటెయిన్ చేయడానికి ఎంత టైమ్ కావాలో అంత టైమ్ మాత్రమే మేము దీనిని స్టోర్ చేస్తాము

మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి

  • Gemini సెట్టింగ్‌లలోని యాప్స్ పేజీకి వెళ్లి, Gemini ఏ యాప్స్‌కు కనెక్ట్ కావాలి అన్నది మీరు ఏ సమయంలోనైనా మేనేజ్ చేయవచ్చు.
  • మీ Gemini యాప్స్ యాక్టివిటీని మీరు ఆఫ్ చేస్తే, యాప్స్ డిజేబుల్ అయిపోతాయి. మీ Gemini యాప్స్ యాక్టివిటీని మీరు ఆన్ చేస్తే, కనెక్ట్ అయి ఉండే ఏ యాప్స్ అయినా మళ్ళీ ఎనేబుల్ అవుతాయి.
Geminiలో కనెక్ట్ అయి ఉన్న యాప్స్ సాయంతో కాల్స్ చేయడానికి, మెసేజ్‌లను పంపడానికి నా డేటా ఎలా ఉపయోగించబడుతుంది?

ఏ డేటా కలెక్ట్ చేయబడుతుంది & ప్రాసెస్ చేయబడుతుంది

కాల్స్ చేయడంలో లేదా మెసేజ్‌లను పంపడంలో సహాయం కోసం, కాలింగ్ లేదా మెసేజింగ్ యాప్స్‌కు మీరు Geminiని కనెక్ట్ చేస్తే, Gemini మొబైల్ యాప్స్ మీకు చెందిన ఈ సమాచారాన్ని కలెక్ట్ చేసి, ప్రాసెస్ చేస్తాయి:

  • Gemini యాప్స్ యాక్టివిటీ
  • డివైజ్ కాలింగ్, మెసేజింగ్ లాగ్స్
  • కాంటాక్ట్ సమాచారం
  • పరికరం సమాచారం, సెట్టింగ్‌లు

మీరు గతంలో Google Assistant సహాయంతో కాల్స్ చేయడానికి లేదా మెసేజ్‌లను పంపడానికి Gemini మొబైల్ యాప్‌ను ఉపయోగించి ఉంటే, Google Assistantకు సంబంధించి 90 రోజుల వరకు సేవ్ అయ్యి ఉన్న మీ కమ్యూనికేషన్ల రిక్వెస్ట్ హిస్టరీ (ఉదాహరణకు, "రాణీకి మెసేజ్ చేయి") మీ వెబ్ & యాప్ యాక్టివిటీ నుండి మీ Gemini యాప్స్ యాక్టివిటీకి దిగుమతి చేయబడుతుంది. ఇతర సర్వీసులతో, సెట్టింగ్‌లతో Gemini యాప్స్ యాక్టివిటీ ఎలా పని చేస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోండి.

డేటా ఎలా ఉపయోగించబడుతుంది

కనెక్ట్ అయి ఉన్న యాప్స్‌ను ఉపయోగించి కాల్స్ చేయడానికి లేదా మెసేజ్‌లను పంపడానికి, మీ డేటాను Gemini మొబైల్ యాప్స్ ఇందుకు ఉపయోగిస్తాయి:

  1. అన్నింటికన్నా బాగా ఉపయోగపడే కాలింగ్ లేదా మెసేజింగ్ యాప్‌ను ఎంచుకోవడానికి
  2. సరైన వ్యక్తితో మిమ్మల్ని కనెక్ట్ చేయడంలో సహాయపడటానికి.

మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి

  • కాల్స్ చేయడానికి లేదా మెసేజ్‌లను పంపడానికి Gemini మొబైల్ యాప్స్ మీ యాక్టివిటీని ఉపయోగించుకోవడం మీకు ఇష్టం లేకపోతే, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యాక్టివిటీని మీ Gemini యాప్స్ యాక్టివిటీలో తొలగించవచ్చు.
  • మీరు Gemini సెట్టింగ్‌లలోని మీ యాప్స్ పేజీకి వెళ్లి, కాలింగ్ యాప్స్‌ను, మెసేజింగ్ యాప్స్‌ను ఏ సమయంలోనైనా డిజేబుల్ చేయవచ్చు. Geminiలో యాప్స్‌ను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

ముఖ్య గమనిక: వ్యక్తిగత ఫలితాలు, లాక్ స్క్రీన్‌పై Assistant సెట్టింగ్‌ల వంటి Google Assistant సెట్టింగ్‌లు, Geminiకి కనెక్ట్ అయి ఉండే యాప్స్‌కు వర్తించవు.

Gemini Live

Gemini Live సంభాషణల డేటాను Google ఏ విధంగా ఉపయోగిస్తుంది?

Gemini Liveతో మీ ఇంటరాక్షన్‌ల రికార్డింగ్‌లు, టైప్ చేసిన మాటల ఫైల్స్, అలాగే Gemini Liveతో మీరు షేర్ చేసిన ఇతర కంటెంట్ Gemini యాప్స్ గోప్యతా ప్రకటన ఆధారంగా ప్రాసెస్ అవుతాయి, Gemini యాప్స్ యాక్టివిటీ అన్‌లో ఉంటే, దానిలో స్టోర్ అవుతాయి. మీరు ఏ సమయంలో అయినా మీ Gemini యాప్స్ యాక్టివిటీని మేనేజ్ చేయవచ్చు, అలాగే తొలగించవచ్చు.

మీ Gemini యాప్స్ యాక్టివిటీ ఆఫ్‌లో ఉంటే, మీ Gemini Live చాట్‌లు గరిష్ఠంగా 72 గంటలు మీ Google ఖాతాలో స్టోర్ అయి ఉంటాయి, తద్వారా Google సర్వీస్‌ను అందించి, ఏ ఫీడ్‌బ్యాక్‌ను అయినా ప్రాసెస్ చేయగలదు. మరింత తెలుసుకోండి.

మీ Gemini యాప్స్ యాక్టివిటీ ఆన్‌లో ఉంటే, మీ Live చాట్‌ల టైప్ చేసిన మాటల ఫైల్స్, Googleకు చెందిన AI టెక్నాలజీలను మెరుగుపరచడంలో వినియోగించబడతాయి. మీకు అందుబాటులో ఉన్న చాయిస్‌ల గురించి మరింత తెలుసుకోండి.

Googleకు చెందిన AI టెక్నాలజీలను మెరుగుపరచడానికి ప్రస్తుతం Live ఆడియో రికార్డింగ్‌లను ఉపయోగించడం లేదు. అది మారితే, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాము.

దయచేసి ఇతరుల గోప్యతను గౌరవించండి, Live చాట్‌లో రికార్డ్ చేయడానికి లేదా చేర్చడానికి ముందు వారి అనుమతిని కోరండి.

Gemini Liveను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

Chromeలో Gemini

నేను Chromeలో Geminiని ఉపయోగించినప్పుడు నా డేటాకు ఏమవుతుంది?

మీరు Chromeలో Gemini ఫీచర్‌ను ఉపయోగించేటప్పుడు, మీరు చూస్తున్న బ్రౌజర్ ట్యాబ్ నుండి ఆటోమేటిక్‌గా పేజీ కాంటెక్స్ట్‌ను, URLను కలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తుంది. Gemini ఉపయోగించే పేజీ కాంటెక్స్ట్‌లో కొంత భాగం మీకు కనిపించకపోవచ్చు.

డేటా ఎలా స్టోర్ చేయబడుతుంది

Chromeలో Gemini ఫీచర్ ద్వారా మీరు విజిట్ చేసే వెబ్‌సైట్స్ నుండి సమాచారం, దానితో మీరు షేర్ చేసే ఆడియో అలాగే ఫైల్స్ Gemini యాప్స్ యాక్టివిటీలో స్టోర్ అవుతాయి. పేజీ కంటెంట్ అనేది మీ Google ఖాతాకు తాత్కాలికంగా లాగ్ చేయబడుతుంది, అది మీ Gemini యాప్స్ యాక్టివిటీలో కనిపించదు.

మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి

మీరు Geminiతో బ్రౌజర్ ట్యాబ్ సమాచారాన్ని షేర్ చేసుకోవడాన్ని నిలిపివేయడానికి ఎంచుకోవచ్చు. మరింత తెలుసుకోండి.

Gemలు

నేను Gemలను ఉపయోగించినప్పుడు నా డేటా విషయంలో ఏమి జరుగుతుంది?

డేటా ఎలా ఉపయోగించబడుతుంది

Gemini యాప్స్ సమాధానాలను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి Gemలను క్రియేట్ చేసి, సేవ్ చేయవచ్చు. మీరు అందించే సమాచారాన్ని మీకు తగిన సమాధానాలను జెనరేట్ చేయడానికి Gemini యాప్స్ ఉపయోగిస్తాయి. మీ Gem పేరు, అనుకూల సూచనలు, సంబంధిత సమాచారం అనేవి రివ్యూవర్ల సహాయంతో Googleకు చెందిన AI టెక్నాలజీలను మెరుగుపరచడంతోపాటు, Gemini యాప్స్ గోప్యతా ప్రకటనకు, Google గోప్యతా పాలసీకి అనుగుణంగా ఉపయోగించబడతాయి.

మీ Gemini యాప్స్ యాక్టివిటీ ఆఫ్ చేయబడి ఉంటే:

  • మీరు క్రియేట్ చేసిన ఏవైనా Gemలు ఇప్పటికీ Gemini యాప్స్‌లో సేవ్ చేయబడతాయి.
  • Gemini యాప్స్ గోప్యతా ప్రకటనలో నిర్దేశించబడినవి తప్ప Gemలతో చాట్‌లు ఏవీ సేవ్ చేయబడవు.

Gemini యాప్స్ యాక్టివిటీ ఆన్‌లో ఉన్నా లేదా ఆఫ్‌లో ఉన్నా, కొత్త Gemను రూపొందించేటప్పుడు క్రియేట్ చేయబడిన ప్రివ్యూ చాట్‌లు సేవ్ చేయబడవు.

మీరు Gemలను ఎలా తొలగించచవచ్చు

మీరు Gemini  వెబ్ యాప్‌లో Gemలను తొలగిస్తే అవి తొలగించబడతాయి. మీరు Gemini వెబ్ యాప్‌లోని Gemల మేనేజర్ పేజీలో Gemలను తొలగించవచ్చు.

మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి

మీరు Gemini వెబ్ యాప్‌లోని Gemల మేనేజర్ పేజీలో మీ Gemలను మేనేజ్ చేయవచ్చు.

Canvas

నేను Canvas వెబ్ యాప్స్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు నా డేటాకు ఏమవుతుంది?

యూజర్ జెనరేట్ చేసిన Canvas యాప్స్‌తో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు, సదరు యాప్స్ క్రియేటర్లు మీరు ఎంటర్ చేసే ఏ విధమైన ఇన్‌పుట్‌ను అయినా చూడగలరు. 

డేటా ఎలా స్టోర్ చేయబడుతుంది

యూజర్ డేటాను నిరంతరం Firebaseలో స్టోర్ చేసే ఆప్షన్‌ను Canvas యాప్స్‌కు Google అందిస్తోంది. యాప్ క్రియేటర్లు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకోవడానికి ఎంచుకోవచ్చు, కానీ మీతో చేసిన ఏ విధమైన ఇంటరాక్షన్ డేటానయినా ఇతర లొకేషన్లలో కూడా స్టోర్ చేయవచ్చు (లేదా అసలు స్టోర్ కూడా చేయకపోవచ్చు).

మీ డేటాను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ విధంగా మేనేజ్ చేయాలి

జాగ్రత్తగా అడుగేయండి, మీరు విశ్వసించే యాప్‌లతోనే ఇంటరాక్ట్ అవ్వండి. మీరు Canvas యాప్‌తో ఏ డేటానయినా ఒకసారి షేర్ చేసాక, మీకు దాన్ని తొలగించే ఆప్షన్ ఉండదు, కానీ యాప్ క్రియేటర్‌కు ఉంటుంది.

సంబంధిత రిసోర్స్‌లు

Gemini మొబైల్ యాప్స్‌కు సంబంధించిన మరిన్ని రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10007248453448514499
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
5295044
false
false
false
false